మంత్రి సవిత ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎమ్మెస్ రాజు భేటీ

అమరావతి : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంతి ఎస్.సవితను ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటప్రసాద్, ఎమ్మెస్ రాజు భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోని ఆమె పేషీలో మంత్రి సవితను కలిశారు తమ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులపై మంత్రితో ఎమ్మెల్యేలు వెంకటప్రసాద్, ఎమ్మెస్ రాజు చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోజక వర్గంలో పలు ప్రభుత్వ కార్యాక్రమాల అమలుపై దిశా నిర్దేశం చేసినట్లు వెల్లడించారు. అనంతరం వారి మధ్య ఉమ్మడి అనంతపురం రాజకీయాలపై చర్చ జరిగిందన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.  పెనుకొండ మున్సిపాల్టీలో తాగునీటికి పంపిణీకి చర్యలు
ఎన్టీఆర్ సుజల పథకం కింద పెనుకొండ నియోకజ వర్గంలోని అయిదు మండలాల్లో తాగునీటి పంపిణీ చేస్తున్న విషయం విధితమే. తాజాగా మున్సిపాల్టీల్లోనే అమృత పతకం కింద మినరల్ వాటర్ పంపిణీ చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ మేరకు శ్రీసాయి వాటర్ ట్రీట్ మెంట ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యానికి దిశా నిర్దేశం చేశారు. బుధవారం ఆ సంస్థ ప్రతినిధి మిత్ర ఓబులేష్..మంత్రిని కలిశారు. మున్సిపాల్టీ అంతటా తాగునీరు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత సూచించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!