
మద్దికేరలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
మద్దికేర న్యూస్ వెలుగు: మండల కేంద్రమైన మద్దికేరలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు 25,26,27 తేదీలలో గ్రామ ప్రజలు మరియు భక్తాదుల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ తెలియజేశారు. 25వ తేదీ మొదటి రోజైన మంగళవారం రోజున అంతర రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు, రాష్ట్రస్థాయి చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. 26వ తేదీన రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తామని,27 వ తేదీన రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ప్రతిభ కనబరిచి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయుచున్నట్లు ఆయన తెలియజేశారు. కావున ఆసక్తిగల క్రీడాకారులు మూడు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీలలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వహకులు విజయప్రసాద్ యాదవ్ తెలియజేశారు.ఇతర విషయాలకు 9701950620, 8121141513 నంబర్లను సంప్రదించాలని ఆయన తెలియజేశారు.

