మహానాడు ఏర్పాట్లు పూర్తి : మాజీ మంత్రి దేవినేని ఉమా

మహానాడు ఏర్పాట్లు పూర్తి : మాజీ మంత్రి దేవినేని ఉమా

న్యూస్ వెలుగు కడప : సోమవారం  కడప జిల్లా సి కె దిన్నె మండలం పబ్బాపురంలో జరగనున్న  హానాడు ఏర్పాట్లను పరిశీలించినట్లు మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. మూడు రోజుల పాటు పండుగలా నిర్వహించే మహానాడుకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. వేదిక నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు. ఆహ్వానితులు, ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. మహా సంబరంగా తరలివచ్చే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆహార ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!