
మహాసభలను విజయవంతం చేయండి:ఏఐటీయూసీ
కర్నూలు న్యూస్ వెలుగు : ఏప్రిల్ 26,27, 28 తేదీల్లో జరుగు ఏఐటీయూసీ రాష్ట్ర పద్దెనిమిదో మహాస భలను జయప్రదం చేయాలని కర్నూలు జిల్లా ఏఐటీయూసీ ముఖ్య నాయకులసమావేశం కర్నూల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్. మునెప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందాయని వారు విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేటర్ ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను కాలరాసే అటువంటి నాలుగు లేబర్ గోడలను తీసుకొచ్చిందన్నారు. దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానిలకి, అంబానీలకు అప్పజెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని వారు విమర్శించారు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలి, ఆటో, వ్యవసాయ కార్మికులకు జాతీయ స్థాయిలో సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావడంలో బిజెపి విఫలం చెందింది. సంస్కరణలు పేరుతో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పథకం ద్వారా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థను తీసుకొని వచ్చి దేశంలో లక్షలాది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు కాకుండా శాశ్వత ఉద్యోగాలకు చరమగీతం పాడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం 108 104 స్కూల్ ఆయా లాంటి స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా గౌరవ వేతనంతో వారి శ్రమను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని కార్మిక వర్గం పోరాటం చేస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. బ్రిటిష్ కాలం నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం, యూనియన్లు పెట్టుకునే హక్కును, భేరాసారాల చట్టాన్ని, సమ్మె చేసే హక్కుని కాలరాస్తూ పెట్టుబడిదారులకి, యజమానులకు కార్మికులపై శిక్షలు విధించేటువంటి బానిస వ్యవస్థని కార్మిక కోడుల ద్వారా తీసుకొచ్చిందని రాష్ట్రంలో పుటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి ఆటో కార్మికులకు అమాలి కార్మికులకు సంక్షేమ కూడా ఏర్పాటు చేస్తామని భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి కార్మికుల బిల్లులు చెల్లిస్తామని అంగన్వాడీల జీతాలు పిలుస్తామని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా కార్మిక హక్కులను కాలరాసే అటువంటి లేబర్ కోడలను రాష్ట్రంలో వేగవంతంగా అమలు చేసేందుకు కార్పొరేట్లతో కుమ్మక్కవుతున్నాడని వారు విమర్శించారు అందుకే కార్మిక హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో తిరుపతిలో జరుగు 18 వ ఎ ఐ టి యు సి రాష్ట్ర మహాసభల లో బిజెపి కూటమి ప్రభుత్వ పాఠశాల అటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్వాలని నిర్ణయించుకొని కార్మిక హక్కులకై ఉద్యమించడానికి ఈ మహాసభల్లో నిర్ణయాలు జరుగుతున్నాయని ఈ మహాసభలు విజయవంతం తిరుపతిలో వేలాది కార్మికులతో జరుగు మహా కార్మికప్రదర్శన జయప్రదం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు జి చంద్రశేఖర్ బి వెంకటేష్, డిప్యూటీ కార్యదర్శి టి. రామాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణారెడ్డి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ టీ నల్లన తదితల పాల్గొన్నారు.

