మానవ మేధస్సును సమాజ శ్రేయస్సుకే వినియోగించాలి

మానవ మేధస్సును సమాజ శ్రేయస్సుకే వినియోగించాలి

నాగార్జున వర్సిటీ న్యూస్ వెలుగు:  ( ఏప్రిల్25):మానవ మేధస్సును సమాజ శ్రేయస్సుకే వినియోగించాల ని ఆంధ్ర ప్రదేశ్ పూర్వ దూరదర్శన్ వార్తా విభాగాధిపతి ఐ ఐ ఎస్ డాక్టర్ జి.కొండలరావు పిలుపునిచ్చారు.

శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ,జర్నలిజం మాస్ కంమ్యూనికేషన్ విభాగాల ఆధ్వర్యంలోయునెస్కో క్లబ్ గుంటూరు వారి సమన్వయం తో జరిగిన సదస్సులో ఆయన విశిష్ట అతిథిగా కీలకోపన్యాసకులుగా పాల్గొన్నారు.’సాంకేతిక యుగంలో విద్యార్థుల బాధ్యత’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం సమాజ హితం కోసం మాత్రమే నేటి యువత ఉపయోగించాలని తద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక మాధ్యమాలను, మొబైల్, ఇంటర్నెట్ వంటి వాటి సదుపాయాలను వినియోగించుకోవడం లో అప్రముత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.నేటితరం విద్యార్థులకు అధునాతన సాంకేతిక వనరులు అన్నీ అందుబాటులో ఉన్నాయని అధ్యాపకుల సలహాలు సూచనలు పర్యవేక్షణతో తమ భవిష్యత్తును ఉత్తమమైన జీవన విధానం గా మలుచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ వంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థినీ విద్యార్థులకు హితోపదేశం చేశారు.
ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు మాట్లాడుతూ నేటితరం విద్యా వ్యవస్థకు, నాటి తరం విద్య వ్యవస్థకు మధ్య వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. విద్యార్థినీ విద్యార్థులు పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సెల్ఫోన్ వాడకం సాధ్యం ఐన మేరకు తగ్గించాలని హితోపదేశం చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ తో కూడిన జీవన విధానాన్ని అవలంబించాలని పేర్కొన్నారు.
ఈ సదస్సులోగౌరవ అతిధి గా పాల్గొన్న వర్సిటీ రెక్టార్ ఆచార్య కే రత్నషీలామణి మాట్లాడుతూ విద్యార్థులు, ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా పై సంపూర్ణమైన అవగాహన కలిగిఉండి , సైబర్ క్రైమ్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సదస్సు సంచాలకులు కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ పీఠాధిపతి ఆచార్య రామినేని శివరామ ప్రసాద్ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రయోజనకరమైన అంశాలపై ముఖ్యంగా నీటి సాంకేతిక యుగంలో విద్యార్థుల యొక్క పాత్రను వివరించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాత్రికేయ విద్యా విభాగాధిపతి ఆచార్య కె జ్యోతిర్మయి మాట్లాడుతూ ” సమాచారం ఎంతో విలువైనదని ముఖ్యమైనదని, ప్రతీనిత్యం ఎంతో సమాచారం ప్రసరణ జరుగుతున్నదనీ దానిని దుర్వినియోగం చేయవద్దని విద్యార్థులకు తెలియజేశారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశ వ్యాప్తంగా పత్రికేయునిగా, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో సేవలు అందిస్తూ ఇటీవల పఫవీ విరమణ పొందిన ఐ ఐ ఎస్ అధికారి డాక్టర్ జి.కొండలరావు ను ఎ ఎన్ యు ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు,రెక్టార్ ఆచార్య కె రత్న షీలా మణి, ఆచార్య రామినేని శివరామ్ ప్రసాద్,యునెస్కో గ్రూప్ గుంటూరు క్లబ్ నిర్వాహకులు పరమేశ్వర రావు,ఆచార్య కె జ్యోతిర్మయి ఘనంగా సన్మానించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించారు.

“యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ జి కొండలరావు నియామకం”

డాక్టర్ జి కొండలరావు సమాజ హిత సేవలను మెచ్చి ను యునెస్కో సంస్థ యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు గౌరవ అధ్యక్షులుగా నియమించినది.ఆ నియామక పత్రాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర రావు ,రెక్టార్ ఆచార్య కె రత్న షీలా మణి కొండలరావు కు అందించి అభినందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!