ముగిసిన శ్రావణమాస పూజలు
హోళగుంద,న్యూస్,వెలుగు:మండల కేంద్రంలో పవిత్ర శ్రావణమాస పూజలు వైభవంగా ముగిసాయి.ప్రధానంగా శ్రీ సిద్దేశ్వర స్వామి,వీరభద్ర స్వామి,శ్రీ మాళ మల్లేశ్వర స్వామి దేవాలయాల్లో శ్రావణమాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.అదేవిధంగా శ్రీ పేటే బసవేశ్వర స్వామి పురాతన దేవాలయాన్నికి మరమ్మత్తు పనులు చేపట్టి ఆలయ గోడలకు టైల్స్,గ్రానైట్,రంగులు వేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకం,ఆకుపూజ వంటి విశేష పూజలు నిర్వహించి,పెద్ద ఎత్తున పూలమాలలతో స్వామివారిని అలంకరించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!