ముగిసిన సర్పంచుల శిక్షణ కార్యక్రమం

ముగిసిన సర్పంచుల శిక్షణ కార్యక్రమం

హోళగుంద: మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈఓపీఆర్డి చంద్రమౌళేశ్వర్ గౌడ ఆధ్వర్యంలో సర్పంచుల శిక్షణ తరగతులు ముగిశాయి.ఇందులో భాగంగా బుధవారం విధి దీపాల నిర్వహణ అంశాల పై చర్చించారు.ఈ సందర్భంగా  ట్రైనర్ రాజశేఖర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా గ్రామాభివృధి,పారిశుధ్య అంశాల పై సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం విధి దీపాల నిర్వహణ పై పలు సూచనలు ఇచ్చారు.అలాగే ఐఎస్ఎల్ మార్క్ ఉన్న విధి దీపాలు కొనుగోలు చేయాలని   ,పగటి పూట విధి దీపాలు వెలగకుండ తర్డ్ వైర్ లాగించాలి,జంక్షన్ బాక్స్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.అంతేకాకుండా విధి దీపాలకు  తప్పనిసరిగా ఆన్ అండ్ ఆఫ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ షఫీ,నాగరాజ్,కార్యదర్శులు రంగ స్వామి,రాజ్ కుమార్,వివిధ గ్రామాల సర్పంచులు,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!