ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
హోళగుంద:మండల కేంద్రంలో మంగళవారం సర్పంచ్ చలువాది రంగమ్మ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ స్థానిక బిసి కాలనీ నందు ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష కాలంలో నేపథ్యంలో సీజనల్ వ్యాపించకుండా ప్రతి కాలనిల్లోని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు.ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కాలనీలకు వచ్చే గ్రామ పంచాయతీ ట్రాకర్,ఆటోలో వేసి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.అలాగే దోమ కాటు,సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.మరియు ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో ఎక్కడైనా పారిశుధ్య పరమైన సమస్యలు ఉంటే సర్పంచ్ కు లేదా కార్యదర్శికి సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి తదితరులు పాల్గొన్నారు.