
రాంపల్లి గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ పై స్పెషల్ డ్రైవ్
తుగ్గలి న్యూస్ వెలుగు : తుగ్గలి మండలం పరిధిలోని గల రాంపల్లి గ్రామం నందు శనివారం రోజున అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం పై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల నిర్వహణ గురించి సచివాలయ అధికారులు విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల యందు సచివాలయ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ పై విద్యార్థులకు ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఈ వ్యర్ధాల వినియోగం మరియు బహిరంగ ప్రదేశాలలో పడివేయడం ద్వారా జరిగే కాలుష్యం మరియు కాలుష్యం వలన జరిగే ఆరోగ్య సమస్యల గురించి వారు విద్యార్థులకు వివరించారు. అనంతరం గ్రామంలోని ప్రజలకు అవగాహన కొరకు విద్యార్థులతో పాటు అవగాహన ర్యాలీలో నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మనింద్ర,మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు,వీఆర్వో రాజేశ్వరి,ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుమన్,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.