రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

రాజధాని నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ , సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా, నిర్దేశించుకున్న సమయానికి పూర్తి కావాలని స్పష్టం చేసారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని చెప్పారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS