రాబోయే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు

రాబోయే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు

అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా, ట్రికోమలికి ఆగ్నేయంగా 310 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది. రెండ్రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ  అధికారులు వెల్లడించారు. రాబోయే 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణకోస్తా ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు  కురుస్తాయని వివరించారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు .ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని అన్నారు.  దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS