
రామలింగాయపల్లి గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం
తుగ్గలి (న్యూస్ వెలుగు): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీకారం చుట్టారు.సోమవారం రోజున మండల పరిధిలోని గల చెన్నంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గల రామలింగాయపల్లె గ్రామంలో తుగ్గలి మండల జడ్పిటిసి పులికొండ నాయక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రంగనాథ్ రెడ్డి,ఓ.జనార్దన్ రెడ్డి,నాగి రెడ్డి, ఉసేన్ పీర,రంజాన్ వలి,చెన్నంపల్లి సుంకన్న లు గ్రామ ప్రజల ద్వారా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన ప్రజల ఆరోగ్యం కు భద్రత లేకుండా పోతుందని వారు తెలియజేశారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపడం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు మరియు ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని వారు తెలియజేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే పెద్ద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని,ఫీజుల భరించలేక పేద ప్రజలకు భారమవుతుందని,నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులో లేకుండా పోతుందని,ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వారు ప్రజలకు తెలియజేసి ప్రజల నుండి సంతకాలను సేకరించారు. కోటి సంతకాల కరపత్రాలను సేకరించి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు అందజేసి,మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేసే విధంగా చర్యలు చేపడతారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, చెన్నంపల్లి,రామలింగాయపల్లి గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

