
మహిళా, యువత ఆర్థిక అభివృద్ధి కోసం ట్రస్టు కృషి చేస్తుంది : ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్
వెల్దుర్తి (న్యూస్ వెలుగు): వెల్దుర్తి కేంద్రంగా శ్రీగిరి గోవర్ధనగిరి చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు. గ్రామ స్వరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇప్పటికే యువతకు మహిళలకు అనేక కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు యువత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ట్రస్టు ఎంతగానో కృషి చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ప్రోత్సహించేలా పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం బాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మండల టీడీపీ నాయకుడు L. E. జ్ఞానేశ్వర్ గౌడ్ ద్వారా కుట్టు మిషన్లు 50 శాతం సబ్సిడీతో 6700 లకు ఇవ్వడం జరుగుతున్నది ఆసక్తి గలవారు ట్రస్టులు సంప్రదించాలని ఆయన తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

