రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలను చెల్లించాలి : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ 

రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల బకాయిలను చెల్లించాలి : ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ జీ 

కర్నూలు న్యూస్ వెలుగు :  కర్నూలు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి నాసర్ జీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయంబర్స్మెంట్ పథకం సరిగా అమలు చేయకపోవడంతో అనేకమంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్య విధానంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కార్పోరేట్ విద్యా వ్యవస్థల మేలు కోసం తప్ప, ప్రభుత్వ విద్య విధానాల కోసం కాదని వారు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద 1200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఇప్పటిదాకా ఏ విద్యార్థికి ఆ బకాయిలు చెల్లించకపోగా వారి జీవితాలతో ప్రభుత్వం చలగాటమాడుతుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రివైబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన నగదును ఇప్పటిదాకా ఆయా కాలేజీలకు చెల్లించ లేదన్నారు. ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి తన మాటల గారడీతో అంకెల వ్యూహంతో విద్యార్థులను ప్రలోభ పెడుతున్నారే తప్ప విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని లేకపోతే ఏప్రిల్ నుంచి ఏఐఎస్ఎఫ్ సహా ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్ల రాజు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS