
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య జిల్లా కదిరినాధుని కోట పంచాయతీ లోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నేరం చేసిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు.
Was this helpful?
Thanks for your feedback!