రుద్రవరంలో  NSS ఆర్ యు సి ఇ యూనిట్ 4 ఆధ్వర్యంలో పల్స్ పోలియో.. మెడికల్ క్యాంపు కార్యక్రమాలు

రుద్రవరంలో NSS ఆర్ యు సి ఇ యూనిట్ 4 ఆధ్వర్యంలో పల్స్ పోలియో.. మెడికల్ క్యాంపు కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్ వెలుగు: ’’రుద్రవరం గ్రామంలో 5వ రోజు NSS స్వచ్ఛంద సేవకులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను సేకరించి వారికి పోలియో చుక్కలు వేశారు . అనంతరం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించబడింది . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నుంచి కొందరు వైద్యులు క్యాంపుకి రావడం జరిగింది. వైద్యుల గురించి గ్రామ ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళందరిని సచివాలయం దగ్గరికి పిలుచుకొని వచ్చి , మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ల సహాయంతో బిపి, షుగర్ , సిజిఎస్ , ఐటిఎఫ్ వండి పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు.
దీంట్లో పాల్గొన్న వాళ్లు వీపి __డాక్టర్ . మహేశ్వర్ రెడ్డి , ఏజిఎం__ మిస్టర్ . ఖాదర్ భాషా  , మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జి .రామాంజనేయులు  డిఎంఓ _డాక్టర్ నిర్మల మేడం  స్టాఫ్ _మాదేశ్వరి  మరియు ఖాజాబీ NSS కోఆర్డినేటర్ పి. నాగరాజు అలాగే NSS ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ నాగాచంద్రుడు .మెడికల్ క్యాంపు పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలందరికీ NSS వాలంటీర్స్ స్క్రబ్ టైఫాస్ వ్యాధి గురించి ఒక స్కిట్ రూపంలో చేసి చూపించారు మరియు , ఆ వ్యాధి నుంచి తీసుకోవాల్సిన భద్రతలు మరియు నియమాలు చెప్పారు. ఈరోజు NSS వాలంటీర్స్ యూనిట్ ఫోర్ మెడికల్ క్యాంప్ ని విజయవంతంగా పూర్తి చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!