రుద్రవరం లో  NSS  యూనిట్ 4 ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నివారణ పై అవగాహన కార్యక్రమం

రుద్రవరం లో NSS యూనిట్ 4 ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నివారణ పై అవగాహన కార్యక్రమం

కర్నూలు, న్యూస్ వెలుగు : రుద్రవరం గ్రామంలో ఆరవ రోజు NSS స్పెషల్ క్యాంపులో భాగంగా ఓటింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు . గ్రామ ప్రజలకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరు తమ ఓటును బాధ్యతతో, సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు . సరైన నాయకులను ఎన్నుకోవడం ద్వారా గ్రామం మరియు దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేశారు.
బాల్య వివాహాలు ఎంత హానికరం , అలాగే ఆడపిల్లలకు చదువు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి NSS వాలంటీర్స్ ఒక స్కిట్ రూపంలో ప్రదర్శన ఇచ్చారు. ఈ స్కిట్ ద్వారా బాలికలను చిన్న వయసులో వివాహం చేయడం వల్ల కలిగే నష్టాలను , చదువు కొనసాగిస్తే వారికి మరియు సమాజానికి కలిగే లాభాలను ప్రజలకు వివరించారు . ప్రతి ఆడపిల్లను తప్పనిసరిగా చదివించాలని , ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సందేశం అందించారు. NSS ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ నాగచంద్రుడు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

Author

Was this helpful?

Thanks for your feedback!