
రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు
న్యూస్ వెలుగు పత్తికొండ :

బీజేపీ మత రాజకీయాల వల్ల ఇప్పటివరకు అభివృద్ధిలో వెనుకబడిన రాయలసీమ మళ్లీ వెనుకబడి పోతుందనే ఆందోళన కలుగుతుంది. ఇప్పటికే రాయలసీమ డిక్లరేషన్ అని ఎన్నికలకు వచ్చిన వారు ఇప్పుడు దాన్ని పక్కన పడేసే పరిస్తితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు RDT సంస్థకు మద్దతుగా చొరవ చూపాలి. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి FCRA రిన్యూవల్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా స్పందించి బీజేపీ జెండాలను తొలగించే స్థాయికి వెళ్లే పరిస్థితి తలెత్తుతుంది.
ఈ అంశాల పైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది. సేవా కార్యక్రమాలపై కక్ష సాధించకుండా, ప్రజల సంక్షేమానికి మద్దతుగా పని చేయడం రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరి బాధ్యత. రాయలసీమ అభివృద్ధి కోసం, పేదల భవిష్యత్తు కోసం, RDT వంటి నిస్వార్థ సేవా సంస్థలను బలపరచాల్సిన అవసరం ఉంది అని. బీజేపీ, కూటమి నాయకులకు మా స్పష్టమైన హెచ్చరిక, RDT సేవలకు ఆటంకం కలిగించొద్దు అని, ప్రజల ఆగ్రహానికి గురి కావొద్దు అని తెలియజేశారు.