
రోడ్డు నిర్మాణ పనులు చేపట్టండి:ఎంపీ నాగరాజు
కర్నూలు:కర్నూలు నగరంలో నుండి ఉల్చాల మీదుగా రేమట గ్రామానికి రహదారి పెండింగ్ పనులను పూర్తి చేయాలని కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ కలిసి విన్నవించారు., స్పందించిన యంపీ ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజుతో చరవాణి ద్వారా సంప్రదించారు యంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గతంలో పూర్తిచేయాల్సిన రహదారి పెండింగ్ ఎందుకు ఉందని అడిగి తెలుసుకుని రేమట రోడ్డు నిర్మాణ పనులకు ప్రభూత్వం ద్వారా చేయించాల్సిన పనులను తాను చేయించడానికి సిద్దంగా ఉన్నానని ఏదైనా సమస్యవుంటే తమను సంప్రదించి పెండింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ ఆదేశించారు.
అనంతరం రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి పోరాటాల ఫలితంగా ఉల్చాల నుండి రేమట మీదుగా కొత్తకోట వరకు రోడ్డు నిర్మాణపనులను చేపట్టారని ప్రజా రవాణా అధికంగా ఉండే రేమట కర్నూలు మధ్య రోడ్డును పెండింగ్ ఉంచడం వల్ల ఆ రోడ్డుపై ప్రయాణించే వందలాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి తరపున ఎన్నోసార్లు వినతులు ఇచ్చిన స్పందన ఉండేది కాదని మూడున్నర సంవత్సరాలకు పైగానే ఆ రోడ్డు నిర్మాణం కోసం రాయలసీమ విద్యార్థి పోరాట సమితి పోరాటాలు చేయాల్సివచ్చిందని అయితే ప్రస్తుత కర్నూలు యంపీ బస్తిపాటి నాగరాజు ని కలిసి సమస్యను తెలిపినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఆయన ఆర్ అండ్ బి ఎస్ఈతో మాట్లాడటం జరిగిందని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అశోక్,సురేష్,వసంత్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.