
రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహ కల్పించిన : డిఐజి కోయ ప్రవీణ్
కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సంధర్బంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.
మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
Was this helpful?
Thanks for your feedback!