
వక్ఫ్ సవరణ బిల్లును జేపిసి కి పంపాము : కిరణ్ రిజిజు
Delhi (డిల్లీ ): వక్ఫ్ సవరణ బిల్లు 2024ను సమీక్షించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ, శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజులోగా లోక్‌సభకు నివేదికను సమర్పిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభకు తెలిపారు. సోషల్ మీడియాలో బిల్లు పై వస్తున్న వాదనలను ఆయన కొట్టేశారు. దీనిపై త్వరలోనే JPC విచారణ తేదీని ప్రచురిస్తుందని. ముస్లింలు మాత్రమే కాకుండా సానుకూల రీతిలో సహకరించలన్నారు. ఇందుకు ఏ దైన సలహాలు సూచనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్నారు. ఈ బిల్లును రాబోయే భవిశ్యత్తును దృస్తీలో ఉంచుకుని దీనిపై పార్లమెంటరీ కమిటీ సభకు నివేదిస్తుందని కిరణ్ రిజిజు సభకు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ముస్లింల సంక్షేమానికి ఉద్దేశించినవని మంత్రి అన్నారు. ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది, తదుపరి పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినట్లు వెల్లడించారు.


 Anji Ramu
 Anji Ramu