వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ

వినతులను స్వీకరించిన జిల్లా ఎస్పీ

Puttaparthi  (పుట్టపర్తి ) : చట్ట పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా పోలీసు అధికారులు ఫిర్యాదు దారుల పట్ల సత్వరమే న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ వి. రత్న ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వినతులను స్వీకరించినట్లు తెలిపారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి,35 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీదారులతో జిల్లా ఎస్పీ వి.రత్న ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా భూ కబ్జాలు ,ఆర్థిక నేరాలు, రైతులను మోసం చేయడం, మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ,అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు,ఆన్ లైన్ మోసాలు,ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రత్న, అదనపు ఎస్పి ఎన్ విష్ణు, దిశా డిఎస్పి శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, ఎస్బి సి ఐ బాల సుబ్రమణ్యం రెడ్డి, సిసి రాఘవేంద్ర,డిసి.ఆర్.బి,సిఐ శ్రీ హర్ష, సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!