విశ్వవ్యాప్త గుర్తింపుపొందిన ఆచార్య నాగార్జునుడు
న్యూస్ వెలుగు : నాగార్జునసాగర్ సమీపంలో అభివృద్ధి చేసిన బుద్ధ వనంలో బౌద్ధ విశ్వవిద్యాలయం స్థాపన కోసం మలేషియా బుద్ధిస్ట్ సంస్థ ముందుకు వచ్చింది. 274 ఎకరాల మేర విస్తరించి ఉన్న బుద్ధ వనం ప్రాజెక్టులో తమకు అవసరమైన స్థలాన్ని కేటాయించిన పక్షంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. బౌద్ధ మత ప్రచారకుడిగా విశ్వవ్యాప్త గుర్తింపుపొందిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయంలో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది విద్య అభ్యసించిన ప్రాశస్త్యాన్ని పరిగణనలోకి తీసుకుని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
Was this helpful?
Thanks for your feedback!