వెంకన్న పవిత్రత పై కొనసాగుతున్న రాజకీయ రచ్చ ..!

వెంకన్న పవిత్రత పై కొనసాగుతున్న రాజకీయ రచ్చ ..!

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార , ప్రతిపక్ష నాయకులు ఒకరి పై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ తిరుమల వెంకన్న పరువు తిస్తున్నారనే అపవాదు సైతం ఆయా పార్టీ లపై ఉండటంతో  రాజకీయ రంగు సైతం మతానికి పూసుకున్న పరిస్థితులు దేశ , రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుందని పలువురు రాజకీయ నిపుణులు చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు   తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిచినట్లు ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS