
వెండితో బెడ్ చేయించుకున్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే
న్యూస్ వెలుగు ; జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇంట్లో వెండితో చేసిన బెడ్, డైనింగ్ టేబుల్.
మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, పూజ సామాగ్రి చుసుంటాం.. కానీ ఆయన ఇంట్లో బెడ్, డైనింగ్ టేబుల్ సహా అన్నీ వెండితో చేయించినవే..!!
ఆయనే మన జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.
ఈ మధ్య ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేశారు. వచ్చీ రావడంతోనే రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని చిత్తు చేసి పాలిటిక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తన బెడ్ రూము లోకి అడుగుపెట్టిన వెంటనే మొత్తం “వెండి” అనే ఫీలింగ్ తనకు రావాలనే ఉద్దేశంతో..తన అభిరుచులకు అనుగుణంగా తన పడకగది మొత్తం నింపేశామని ఆయన చెప్పారు.