
వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్స్చేంజ్ ఎస్సై బ్రహ్మయ్య
బండిఆత్మకూర్ న్యూస్ వెలుగు : బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్చేంజ్ ఎస్సై బ్రహ్మయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని సంత జూటూరు, ఈర్నపాడు బండి ఆత్మకూర్ వైన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై బ్రహ్మయ్య మాట్లాడుతూ బెల్ట్ షాపులకు మద్యం అమ్మేతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా బెల్టు దుకాణాలకు మద్యం అమ్మితే వైన్ షాపులు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేట్ హైవేలకు,దేవాలయాలకు, స్కూళ్లకు, మసీదులకు, చర్చిలకు 220 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఏర్పాటు చేసుకోవాలని లేనియెడల పర్మినెంట్ లైసెన్స్ ఇవ్వమని టెంపరరీ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. కిరాణంషాపు, కూల్ డ్రింక్ షాపులని పేరు బోర్డులు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం తమ దృష్టికి వస్తే. తమ సిబ్బందితో దాడులు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈయన వెంట విజయుడు ఎక్స్చేంజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.