శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

హోళగుందన్యూస్:మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హోళగుంద ఎస్ఐ బాల నరసింహులు అన్నారు.గురువారం హోళగుంద నూతన ఎస్ఐగా బాల నరసింహులు భాద్యతలు చేపట్టారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ప్రశాంతతకు,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ పరిడిలో మట్కా , పేకాట , అక్రమ మద్యం వంటి వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!