ఇతర శాఖల్లో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు!
రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది.
గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ… పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి.గ్రామ/వార్డు సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు. బలోపేతానికి తీసుకోవలసిన చర్యలనూ సూచించింది. అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు దానికి బహిర్గతం చేయడానికి సాహసించలేదు. పనిభారం పెద్దగా లేదని ‘రీసెర్చ్’ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది. ‘2022 నవంబరు-2023 మే నెల నడుమ 37 శాతం గ్రామ సచివాలయాలు, 39.3ు వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5 శాతం లోపే సేవలు అందించాయి. కొన్ని సెమీఅర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకోవాలి.
సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ, పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం, తదితర మానవ వనరులున్నాయి.వీటి మధ్య సంబంధాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు రెండు సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రత దృష్ట్యా విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీమ్ వర్క్ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.