
సాంఘిక సంక్షేమ వసతి గృహాలను అభివృద్ధి చేయాలి
రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓ డిమాండ్
ప్రొద్దుటూరు,న్యూస్ వెలుగు ; స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహం నెంబర్ 2 హాస్టల్ నందు రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు, ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ కడప జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల వార్డెన్లకు గత ఎనిమిది నెలలుగా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు వారి జీతం కూడా మెనుకు పెడుతూ పక్కన వడ్డీలకు తెచ్చుకుంటూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా జరగడం వలన వార్డెన్లు కూడా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించలేకపోతున్నారు దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు అందజేయకపోవడంతో రెగ్యులర్గా బిల్లులు అందుతుంటే విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం పెడతారని ఈ విధంగా నెలలు తరబడి బిల్లులు రాకపోతే మెనూ ప్రకారం భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తారని ఈ సందర్భంగా వారు విమర్శించారు, అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టల్ నందు ఇంచార్జ్ వార్డెన్ పాలన జరుగుతుంది ఈ విధంగా జరగడం వలన హాస్టల్ పర్యవేక్షణ చూసుకోవడం వల్ల నిర్లక్ష్యం వహిస్తారని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు విమర్శించారు, అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఎనిమిది అద్దె భవనాలు ఉన్నాయి దానికి తోడు వర్షాకాలం ఈ అద్దే భవనాలు కూడా నాసిరకంగా ఉన్నాయి అవి ఎప్పుడు కూలిపోతాయి కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు వర్షం పడితే పెచ్చులు ఊడిపోయి విద్యార్థుల మీద పడే దానికి అవకాశం ఉన్నది వసతులు కూడా అద్దె బోనాలలో అంతంత మాత్రమే ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమే కూటమి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు వీటన్నిటి పైన స్పందించి సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు రెగ్యులర్ భవనాలు ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న హెచ్ డబ్ల్యూ ఓ పోస్టులు భర్తీ చేసి సంక్షేమ హాస్టల్లను మెరుగుపరచాలని ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఎస్ ఓ గా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.