సిఐటియు నుంచి ఏఐటీయూసీలోకి చేరిన మున్సిపల్ కార్మికులు
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు మున్సిపాలిటీ నందు పనిచేయుచున్న సిఐటియు యూనియన్ పారిశుధ్య కార్మికులు స్థానిక నాయకులు గంగాధర్ ప్రతాప్ రాజేష్ యాకోబ్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది ఏఐటీయూసీ లోకి వచ్చి చేరారు. వీరిని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు స్థానిక ఏఐటీయూసీ నాయకులు మిడుతూరు ప్రసాదు లక్ష్మీనారాయణలు ఆహ్వానించి సభ్యత్వం ఇచ్చారు.ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ స్థానిక జమ్మలమడుగు మున్సిపాలిటీలో పనిచేయుచున్న పారిశుద్ధ్య కార్మికులకు పండుగ జాతీయ సెలవు దినాలు మహిళలకు ఐదు ప్రత్యేక సెలవు దినాలు అందివ్వకపోవడం ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కార్మికుల పిఫ్ లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. దుమ్మూ ధూళిలో,మురుగు కాలువల శుభ్రంలో నిరంతరం శ్రమించే శ్రామికుల పట్ల వివక్షత సరైంది కాదన్నారు.
అనంతరం జమ్మలమడుగు నూతన సమితి గౌరవ అధ్యక్షులుగా లక్ష్మి నారాయణ, అధ్యక్షులు గా మిడుతురు ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గంగాధర్,ఉపాధ్యక్షులుగా దేవదాస్, మురళి,కార్యదర్శిగా ప్రతాప్, సహాయ కార్యదర్శి గాయాకోబు,ప్రభావతి,కోశాధికారి రాజేష్, సమితి సభ్యులుగా c. శేఖర్,వినోద్, జయపాల్, గ్రేసమ్మ,సరళ సి ఓబులేసు తదితరులను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రాంప్రసాద్ జయన్న నాగేంద్ర భాష తదితరులు పాల్గొన్నారు.