
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పత్తికొండ( న్యూస్ వెలుగు ): తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన నగదు చెక్కులను పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శ్యామ్ బాబు మంగళవారం రోజున లబ్ధిదారులకు అందజేశారు.తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన గుంత సువర్ణమ్మ కు 22000,కిష్టన్న కు 44000,రఫీ కు 72000,వెంకటరాముడు కు 23000 రూపాయల చెక్కులను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,రాతన మనోహర్ చౌదరి, గురు స్వామి,బాలన్న,బీసీ సెల్ మండల అధ్యక్షుడు సంఘాల కృష్ణ,మిద్దె వెంకటేశ్వర్లు,రాతన మైరాముడు, హోటల్ మల్లి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

