
అభివృద్ధికి ప్రాథమిక సూత్రమిది డిప్యూటీ సీఎం
అమరావతి : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశా నిర్దేశం చేశారు. ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రమని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

ప్రతిసారీ రోడ్లు పాడవకుండా నిబంధనల ప్రకారం పటిష్టంగా రోడ్లు వేసేలా కాంట్రాక్టర్లకు స్పష్టమైన నియమావళిని ఇచ్చి, పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా, ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా రాష్ట్రంలో రహదారులు లేని గ్రామాలు లేకుండా సమగ్రంగా ప్రాజెక్టు రూపకల్పన చేసి, పనులు వేగంగా, పకడ్భందీగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలి’’ అన్నారు. ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది – ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రాజెక్టు అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై, రహదారుల అనుసంధానంపై డిప్యూటీ సిఎం మార్గదర్శకంలో ప్రాజెక్టు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుముడిలంక గ్రామంలో పర్యటించి అక్కడ రోడ్డుతో పాటు ఓ వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆధునాతన సాంకేతికత ఉపయోగించుకొని ఆ రోడ్డు అనుసంధానంపై డ్రోన్ తో సర్వే నిర్వహించినట్లు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. సాంకేతికత సాయంతో ప్రాజెక్టు మరింత శరవేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మారిన అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని ముందుకు సాగుతామని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగవంతంగా జరగాలని, దీనికోసం మా వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిలో భాగమై గ్రామీణ రహదారుల నిర్మాణానికి ముందుకు వచ్చి సాయం చేసిన బ్యాంకు ప్రతినిధులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు ప్రతినిధులకు సన్మానించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు శ్రీ బాలు నాయక్, సి.వి.సుబ్బారెడ్డి, పి.వి. రమణ మూర్తి, శ్రీ కె.చక్రవర్తి, శ్రీ బి.డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

