సీమా రాజా పై పోలీసులకు ఫిర్యాదు ..!

మంగళగిరి న్యూస్ వెలుగు :  మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై వైస్సార్సీపీ నేతలు సీమ రాజాపై  మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.  సీమరాజాపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైసీపీ నేతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవరత్నాల నారాయణమూర్తి, పార్టీ లీగల్ సెల్ నారాయణరెడ్డి, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కసినేడి బాజీ గంగాధర్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మొహిద్దిన్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భీమిరెడ్డి శరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కలకోటి సునీల్ కుమార్, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి ఆర్దల మనీష్ కుమార్ (చిన్నారి), కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS