
సూపర్ సిక్స్ సూపర్ హిట్
న్యూస్ వెలుగు అనంతపురం : అనంతపురంలో నిర్వహించిన ‘‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’’ సభను బంపర్ హిట్ చేసిన కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు. 15 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బాధ్యతగల ప్రభుత్వంగా ప్రజలకు వివరించేందుకు ఈ సభ నిర్వహించినట్లు వెల్లడించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేసిన సంక్షేమ పథకాలను సభా వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించామన్నారు. ప్రజలకు ఇప్పటివరకు ఏం చేశామో చెప్పడమే కాకుండా….భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో ప్రజలకు వివరించి వారి మద్దతు కోరామన్నారు. రాష్ట్రాభివృద్ధికి, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చేపట్లే కార్యక్రమాలను వివరించాన్నారు. కూటమి నిర్వహించిన ఈ తొలి సభను ఇంతటి విజయవంతం చేసిన అనంతపురం ప్రజలకు, భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.