
స్కూలు అభివృద్దికి కృషి చేస్తాం
కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలోని నీలం రామచంద్రయ్య జెడ్పి ఉన్నత పాఠశాల
విద్యాకమిటి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్కూల్ ప్రదనోపాధ్యాయులు తెలిపారు. స్కూలు ఛైర్మన్ గా డి మస్తాన్ నాయుడుని ఎన్నుకోగా , వైస్ ఛైర్మన్ గా M మౌనికను ఎన్నిక తరువాత మొదటి సారి సమావేశం నిర్వహించినట్లు ఛైర్మన్ తెలిపారు.
తమకి అవకాశం కల్పించినందుకు ఛైర్మన్ మస్తాన్ , మౌనిక లు విద్యార్ది తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూలు అభివృద్దికి సహరిస్తామని వారు వెల్లడించారు. అనంతరం ఎన్నికైన ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ లను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీవీజీ మస్తాన్, నెరవటి విజయకుమార్, జానకిరాముడు, మధు, లక్ష్మన్న , బివిజి వెంకటేశ్వర్లు , బలోజీ సురేంద్ర, జనసేన నాయకులు బి వి జి సతీష్ కుమార్, శివ నాయుడు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.