
స్మార్ట్ మీటర్లను అడ్డుకున్న ప్రజలు
కర్నూలు న్యూస్ వెలుగు : బలవంతంగా బిగించిన స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలి, స్మార్ట్ మీటర్లను అడ్డుకున్న ప్రజల-సిపిఎం
మీకర్ సెక్షన్ కాలనీలోనే సూర్యనారాయణ నగర్ లో ప్రజలు వద్దన్నా బలవంతంగా బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నగేష్, సిపిఎం నగర నాయకులు శ్యామల, వార్డు సభ్యులు జమ్మన్న, అనసూయ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సూర్యనారాయణ నగర్ లో స్మార్ట్ మీటర్లు ప్రజలు వద్దంటున్న విద్యుత్ అధికారులు బిగించడాన్ని వ్యతిరేకించి ప్రజల అనుమతి లేకుండా ఎందుకు బిగిస్తున్నారని అడగడంతో అక్కడినుండి స్మార్ట్ మీటర్లను తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అప్పటికే ప్రజలందరూ మేము వద్దన్నా మాకు స్మార్ట్ మీటర్లు బిగించారు వెనక్కి తీసుకెళ్లండి అని కోరగా ఏఈ నీ అడగండి అని తెలిపారు. రాష్ట్రమంత్రి, జిల్లా అధికారులు ప్రజల అనుమతి లేకుండా బిగించామని తెలిపారు మీరు ఎందుకు బిగిస్తున్నారని నిలదీస్తే అక్కడినుండి జారుకున్నారు. నగరంలో ఇప్పటికే ప్రజలు లేని సమయంలో వెళ్లి బిగిస్తున్నారని ఎక్కడైనా ప్రజలు నిలదీసిన ప్రభుత్వం చెప్పిందని మాయ మాటలు చెప్పి బిగిస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రజల అనుమతి లేకుండా బిగించిన స్మార్ట్ మీటర్లన్నింటిని తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలే తీసి పగలగొట్టి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి వాడుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

