స్వదేశీ ఉత్పత్తులను కొనండి: కాంగ్రెస్

స్వదేశీ ఉత్పత్తులను కొనండి: కాంగ్రెస్

న్యూస్ వెలుగు కర్నూలు: భారతదేశంలో ఉన్న ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉత్పత్తి అవుతున్న వస్తువులను కొనుగోలు చేయాలని, దీనివల్ల మన డబ్బు మన వద్దే ఉంటుందని , లాభాలు మన వద్దే ఉంటాయని ,మన ప్రాంతంలో ఉన్న యువతి యువకులకు ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. విదేశీ మోజుతో విదేశీ వస్తువులను ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం కూడా ప్రతి జిల్లా కేంద్రంలో స్వదేశీ ఉత్పత్తులతో కూడిన సూపర్ బజార్లను ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. విదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల లాభాలు ఇతర దేశాలకు వెళ్ళిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. వీలైనంతవరకు స్వదేశీ వస్తువులను ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ భారత దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రూపేనా సదుపాయాలు కల్పిస్తే ఇక్కడే పెట్టుబడులు పెట్టి స్థానిక యువతి యువకులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందన్నారు. విదేశీ పెట్టుబడులు మన భారతదేశానికి మంచిది కాదని, బానిస బ్రతుకులు ఇక వద్దు అని ఆయన కోరారు . కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు సరైన సదుపాయాలు కల్పిస్తే నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారుల సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. భారతదేశంలో జిడిపి పెరిగిపోతున్న దేశ ప్రజలు ఆర్థికంగా ఎందుకు వెనుకబడి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. చాలామందికి స్వదేశీ ఏది విదేశీ ఏది తెలియని పరిస్థితి ఉందని మేడిన్ ఇండియా అని ఉన్న కొంతవరకు ప్రయోజనం ఉందని కానీ లాభాలు మాత్రం విదేశాలకు తరలిపోతుందన్నారు. ప్రజలు ఆయా జిల్లా కేంద్రాలలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. జిల్లా యంత్రాంగం కూడా స్థానిక యువ పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెట్టుబడిదారులకు దారాళంగా వరాలు ఇవ్వకుండా భారతదేశంలో ఉన్న యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందించి స్థానిక ఉత్పత్తులకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తే స్థానికంగా ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లభిస్తాయని అదేవిధంగా స్థానికంగా ఉన్న ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!