
స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకోవాలి
డోన్,న్యూస్ వెలుగు; సెప్టెంబర్ 11 న స్వాతంత్ర్య సమరయోధుడుగాంధేయవాది శ్రీ వినోభా భావే గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యంలో స్వాతంత్ర్యసమరయోధుడు గాంధేయ వాది వినోభా భావే గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించారు. వారిని స్మరించుకున్నారుఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూమన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారుశ్రీ వినోభా భావే మహారాష్ట్రలోని గగోదే లో 1895 సెప్టెంబర్ 11న జన్మించాడు.ఈయన మహాత్మా గాంధీతో పాటు భారతస్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను జైలు కెళ్ళాడు. 1958 లో “సామాజిక నాయకత్వం”పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కార స్వీకర్త వినోభా కావడం మనదేశానికి గర్వనీయం. ఈయన 1982 నవంబర్ 15 న స్వర్గస్తులైనారు. ఈయనకు 1983 లో భారతరత్న బిరుదుని ప్రభుత్వం ప్రకటించింది. మన మందరం స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడలలో నడుద్దామని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.