హిందూ మహాసముద్ర భద్రత పై కుదిరిన ఒప్పందం
అంతర్జాతీయం : హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భద్రత ,స్థిరత్వ సవాళ్లను పరిష్కరించడానికి కొలంబోలో కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ (CSC) సెక్రటేరియట్ స్థాపన కోసం భారతదేశం, మాల్దీవులు, మారిషస్ మరియు శ్రీలంకలు చార్టర్ మరియు ఎమ్ఒయుపై సంతకం చేశాయి. శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో సంతకం కార్యక్రమాన్ని నిర్వహించింది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు మాల్దీవులు, మారిషస్ మరియు శ్రీలంక ప్రతినిధులు సంబంధిత సభ్య దేశాల తరపున పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ, సాంప్రదాయ, సాంప్రదాయేతర హైబ్రిడ్ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!