హోళగుంద,న్యూస్ వెలుగు:మండల పరిధిలో గురువారం సర్పంచ్ కృష్ణవేణి ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గ్రామంలో కురుకుంద రోడ్డు నుంచి పెద్ద వంక వరకు జేసిబి ద్వారా ముమ్మరంగా పారిశుధ్య పనులు

చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ వర్ష కాలంలో నేపథ్యంలో సీజనల్ వ్యాపించకుండా ప్రతి కాలనిల్లోని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు.ప్రజలు తమ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అలాగే దోమ కాటు,సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.గ్రామంలో ఎక్కడైనా పారిశుధ్య పరమైన సమస్యలు ఉంటే సర్పంచ్ కు లేదా కార్యదర్శికి సమాచారం అందిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నరసప్ప తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!