హైదరాబాద్‌లో అలరించిన ఎయిర్‌ షో.. హుస్సేన్‌సాగర్‌పై అద్భుత విన్యాసాలు

హైదరాబాద్‌లో అలరించిన ఎయిర్‌ షో.. హుస్సేన్‌సాగర్‌పై అద్భుత విన్యాసాలు

  హైదరాబాద్‌ ;    హైదరాబాద్‌  లో నిర్వహించిన ఎయిర్ షో  అలరించింది. హుస్సేన్‌ సాగర్‌  పై భారత వాయుసేన  కు చెందిన సుశిక్షిత పైలట్‌లు విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. సూర్యకిరణ్‌ విమానాల  తో ఈ విన్యాసాలు నిర్వహించారు. ఈ ఎయిర్‌ షోను వీక్షించేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ ఎయిర్‌ షోను నిర్వహించారు. సెక్రెటేరియట్‌ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తదితరులు ఈ ఎయిర్‌ షోను తిలకించారు. విమానాలతో పైలట్‌లు ఆకాశంలో రంగురంగుల సింబల్స్ వేశారు. రెండు విమానాలతో వేసిన లవ్‌ సింబల్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తం 15 సూర్యకిరణ్‌ విమానాలను ఈ ఎయిర్‌ షోకు ఉపయోగించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS