న్యూస్ వెలుగు, కర్నూలు; పదో తరగతి పరీక్షల్లో ఏడా

ది మెరుగైన ఫలితాలు సాధించాలని, అందుకోసం జిల్లా వ్యాప్తంగా వందరోజుల యాక్షన్ ప్లాన్ సత్వరమే అమలుకు శ్రీకారం చుట్టాలని, జిల్లా వ్యాప్తంగా మండల విద్యాధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఆదోని మండలం జడ్పీహెచ్ఎస్, విరుపాపురం పాఠశాలను సందర్శించిన డీఈఓ , పదవ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగించాలని ఇది కీలకమైన సమయంగా భావించాలని డిసెంబర్ జనవరి, ఫిబ్రవరీ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. నవంబర్ చివరి నాటికంతా సిలబస్ కంప్లీట్ చేయాలి .పదవ తరగతి విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించేందుకు, అగ్రస్థానంలో నిలిపేలా ఉప విద్యాశాఖా అధికారులు , మండల విద్యాధికారులు , ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు విద్యార్థుల తండ్రి తండ్రులు కృషి చేయాలన్నారు. ఈ మేరకు సమన్వయంతో చిత్తశుద్ధితో అందరూ పనిచేస్తే జిల్లాలో utternatha శాతం పెంచే అవకాశం ఉందన్నారు.
Thanks for your feedback!