పుట్టపర్తి లో ఘనంగా జయంతి వేడుకలు

పుట్టపర్తి లో ఘనంగా జయంతి వేడుకలు

పుట్టపర్తి న్యూస్ వెలుగు :  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో శత జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి దిగ్విజయంగా పూర్తి చేశామని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పేర్కొన్నారు. సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు దిగ్విజయం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మరియు సత్యసాయి ట్రస్ట్ సభ్యులకు మీడియా ప్రతినిధులకు సత్యసాయి కోట్లాదిమంది భక్తులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలిసి సోమవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అనంతపురం పి వీ కేకే కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పుట్టపర్తి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బాబా ఆశీస్సుల వల్లనే పెద్ద జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకొని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు , సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ తో పాటు ట్రస్ట్ సభ్యులు ,రాష్ట్ర యంత్రాంగానికి ,జిల్లా యంత్రాంగానికి ,సత్యసాయి భక్తులకు,మీడియా ప్రతినిధులకు ,ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ శతజయంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో పుట్టపర్తి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్ర అభివృద్ధిలో సత్యసాయి సాయి భక్తులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రపంచ కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమై నిన్నటిదినంతో ఎంతో దిగ్విజయంగా పూర్తయ్యాయి. పుట్టపర్తిలో జరిగిన ఈ శత జయంతి ఈ వేడుకలకు విచ్చేసిన దేశ విదేశాలకు చెందిన వీఐపీలు ప్రముఖులు , సత్య సాయి భక్తులకు సత్యసాయి సేవాదళ్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పుట్టపర్తికి విచ్చేసిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ , ఎన్.వి రమణ, సుబ్రమణియం, త్రిపుర ఒడిస్సా ఉత్తరప్రదేశ్ మేఘాలయ గవర్నర్లు,కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ , పీయూష్ గోయల్ ,రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ,లోకనాథ్ మురుగన్ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ,మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్న వీస్ ,మాజీ సీఎం అశోక్ చౌహాన్ ,రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల ఘనంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు పుట్టపర్తికి విచ్చేసిన రాష్ట్ర మంత్రుల కమిటీ పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ సత్య కుమార్ సవితమ్మ కందుల దుర్గేష్ ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర యంత్రాంగం తో పాటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో రెవెన్యూ ,పోలీస్ ,మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ ,విద్యుత్ ,ఆర్ అండ్ బి, ఆర్ డబ్లూ ఎస్, వ్యవసాయ శాఖ , ఇరిగేషన్ ,పర్యాటక శాఖ ,సమాచార శాఖ , ఆర్టీసీ ,ట్రాన్స్ పోర్టు,పోస్టల్ ,రైల్వే తో పాటు ఇతర శాఖల అధికారులు, సత్యసాయి ట్రస్ట్ సహకారంతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, నిమిస్ పాండే , చక్రపాణి ,సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఈ వేడుకల్లో భాగస్వాములైన సత్యసాయి సేవాదళ్ సభ్యులకు ,ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు శతజయంతోత్సవాలు అత్యంత దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించిన సత్యసాయి భక్తులకు ,పుట్టపర్తి ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఎంత ఘనంగా ప్రారంభమై ఎంతో దిగ్విజయంగా ముగిశాయని తెలిపారు. ఈ శత జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించేలా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణమే స్పందించి సత్యసాయి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సత్యసాయి ఆశీస్సులతో పుట్టపర్తిలో శతజయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వివిఐపీలు వీఐపీలు ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి శతజయంతి వేడుకల్లో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఇక్కడికి విచ్చేసిన సత్యసాయి భక్తులకు ప్రముఖులకు మీడియా ప్రతినిధులకు రాష్ట్ర యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి , డీఐజీ సీమోషి ,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో అన్ని శాఖలు భాగస్వాములై అహర్నిశలు కృషిచేసిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ తో పాటు మిగతా సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS