
108 ను ప్రభుత్వమే నిర్వహించాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; 108 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని 108 ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు స్థానిక కార్మిక కర్షక భవన్ నందు 108 ఎంప్లాయిస్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు రాజేష్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కర్నూలు జిల్లా 108 ఉద్యోగుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు నరసింహ రాష్ట్ర కార్యదర్శి బి .నరసింహులు రాష్ట్ర ట్రెజరర్ శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్ సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి అంజిబాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ 108 వ్యవస్థను మరింత ప్రతిష్ట పరచాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఆందోళనలు ఎస్మా ప్రయోగించాలని ప్రయత్నించిందని అయినప్పటికీ ఉద్యోగుల ఐక్యమత్యంతో అనేక డిమాండ్లను సాధించుకోవడం జరిగిందని అన్నారు. జీతం 4000 రూపాయలు సాధించుకోవడం జరిగిందని అలాగే భవిష్యత్తులో పిఆర్సి పెరిగినప్పుడల్లా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతం పెరిగితే 108 ఉద్యోగులకు కూడా జీతం పెరిగే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని అన్నారు .రాబోవు కాలంలో ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉండి మరిన్ని విజయాలు సాధించాలని వారు కోరారు ఈ సమావేశంలో 108 ఉద్యోగుల సంఘం నాయకులు మహేష్ పార్థసారథి రాజశేఖర్ రెడ్డి జీవన్ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar