
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని మండల విద్యాశాఖ అధికారి యశోద తెలిపారు. గురువారం జరిగిన 10వ తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 18 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు. మండలంలోని జడ్పీ హైస్కూలులో 212 మందికి 204 మంది, ఏపీ మోడల్ స్కూల్‌లో 220 మందికి 213 మంది, సంత జూటూరు జడ్పీ హైస్కూల్‌లో 97 మందికి 94 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంఈవో తెలిపారు. ఎగ్జామినేషన్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రఘురామిరెడ్డి, వారి సిబ్బంది స్కాడుగా రావడం జరిగిందన్నారు. జడ్పీ హైస్కూలు, ఏపీ మోడల్ స్కూల్,
పరీక్ష కేంద్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎంఈవో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

