
మండలానికి 110 క్వింటాళ్ల కే-6 వేరుశనగ మంజూరు
మండల వ్యవసాయ అధికారి రవి
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మద్దికేర మండలానికి 110 క్వింటాళ్ల కదిరి-6 రకం వేరుశనగ మంజూరు అయినట్లు మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే-6 వేరుశనగ కొరకు స్థానిక రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన తెలియజేశారు.వేరుశనగ పూర్తి ధర 9600 కాగా,40 శాతం ప్రభుత్వ సబ్సిడీ అనగా 3840 రూపాయల పోగా,రైతు 5760 రూపాయలను ఒక క్వింటానికి చెల్లించాలని ఆయన తెలియజేశారు. ఒక రైతుకు గరిష్టంగా 90 కిలోల విత్తన వేరుశనగను మాత్రమే మంజూరు చేస్తామని ఆయన తెలియజేశారు. అదేవిధంగా కందిలో సస్యరక్షణ కొరకు పూతలో పురుగు, గూడు పురుగు నివారణ కొరకు బెంజోయేట్ మరియు లేపునురాన్ లేదా కోరోజన్ ను పిచికారి చేసుకోవాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా శనగలో తెగులు నివారణ కొరకు సాఫ్ లేదా కార్బన్డిజం ను మొక్కల మొదలు తడిచేలాగా పిచికారి చేసుకోవాలని మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి రైతులకు తెలియజేశారు.