కేంద్ర ఎన్నికల సంఘం తొమ్మిది రాష్ట్రాల్లోని 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆగస్టు 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది . ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన అనంతరం సెప్టెంబర్ 3న ఎన్నికలు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నిక సంఘం వెల్లడించింది.