
ఘనంగా 134వ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో గురువారం 134వ జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వీరూపాక్షి జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి,మహిళలు చదువు కోసం భార్య సావిత్రిపూలే చదువు చెప్పి మహిళలు అందరు చైతన్య చేసి అందరు అన్ని రంగంలో ముందు ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజా,వెంకటేష్,మహాదేవ, శివ,సాయి,మృత్యుంజయ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!