
ఏపీలో మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి
అమరావతి : దేశంలో తొలిసారిగా మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ను ఉండవల్లిలోని నివాసంలో లాంఛనంగా ప్రారంభించాను. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009ను కేటాయించడం జరిగింది. ‘మన మిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం నినాదంతో ప్రారంభించాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా. ధృవపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకువచ్చాం. ప్రపంచంలో ఎక్కడా ఇన్ని సేవలు ఒకే ప్లాట్ ఫాం ద్వారా అందజేయలేదు. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్ గవర్నెన్స్. ఈ కార్యక్రమంలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ సంధ్య దేవనాథన్ గారు, వాట్సప్ డైరెక్టర్, ఇండియా హెడ్ రవి గార్గ్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ భాస్కర్ కాటమనేని గారు, ఆర్టీజీఎస్ సీఈవో కే.దినేష్ గారు పాల్గొన్నారు.


 DESK TEAM
 DESK TEAM