ఆదోని జిల్లా కోసం 136వ రోజు రిలే నిరాహార దీక్ష

ఆదోని జిల్లా కోసం 136వ రోజు రిలే నిరాహార దీక్ష

న్యూస్ వెలుగు, ఆదోని; ఆదోని జిల్లా కోసం గత 136 రోజులగా సుదీర్ఘంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా ఉద్యమాన్ని నడుపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి గతంలో ఉన్న ఆదోని జిల్లా జేఏసీ నాయకులు100వ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లేకుండా విరమించుకోవడం వల్ల ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ చాలా నిరాశ చెందారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఆదోని జిల్లా జేఏసీ లో భాగస్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఆదోని జిల్లా రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు గ్రామాలల్లో ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు ఆదోని జిల్లా ఉద్యమాన్ని నడపడానికి అవసరమైనటువంటి సమయం, అనుభవం, ఆర్థికం ఎంతో ఉన్నప్పటికీ ఉద్యమం ముందుకు నడపాలి అన్న ఉద్దేశంతో వారి దగ్గర లేకపోయినా ఉన్న దాంట్లోనే ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే ఏప్రిల్ నెలలో రిలే నిరాహార దీక్ష ఉద్యమం 150 రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ప్రజా సంఘాల నాయకులను కుల సంఘాల నాయకులను, వామపక్ష పార్టీల పెద్దలను ఆ బహిరంగ సభకు పిలిచి ఆదోని ఉద్యమంను తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని తలచినాము. ఈ కార్యక్రమం చాలా ఆర్థికంతో కూడుకున్నది కాబట్టి ఎవరైనా ఉద్యమానికి మద్దతు తెలుపదలుచుకున్న వారు ఆర్థికంగా సహాయం చేయాలనుకున్న వారు దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షకు కూర్చున్న వారికి సంఘీభావం తెలిపి మీ యొక్క ఆర్థిక సహకారం అందించాలని ఐదు నియోజకవర్గాల ప్రతి ఒక్కరిని పేరుపేరునా కోరుకుంటున్నాం. అయితే గతంలో ఎటువంటి హామీ లేకుండానే దీక్షను విరమించుకున్నటువంటి కొందరు ఇప్పటికీ ప్రజల్లో నుంచి చందాలు వసూలు చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీనిని దృష్టిలో ఉంచుకొని అలాంటి వారిని మందలించి ఉద్యమం నడిపే వారికి మీ యొక్క ఆర్థిక సహకారం అందిస్తారని ఆదోని జిల్లా జేఏసీగా మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఇకపోతే ఈ రోజు 136వ రోజు రిలే నిరాహార దీక్షలు రామకృష్ణ, సుభాష్ చంద్రబోస్ రామాంజనేయులు, కుమార్ కూర్చొని ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ఆదోని జిల్లా కార్యక్రమాన్ని బుజస్కందాల పైన వేసుకుని ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లడానికి సన్నద్ధమైనారు. గ్రామ గ్రామాన ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యవంతమ్ తీసుకొస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు వై పి నాగరాజు, పగడాల కోదండ, బండారి హనుమంతు,గోవిందు, గుమ్మల బాలస్వామి, నల్లారెడ్డి, టి వీరేష్, పిఎస్ వీరేష్, మలిగే రామలింగయ్య తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS